“వైష్ణవ్‌తేజ్‌ యొక్క ఆదికేశవ ట్రైలర్‌

Adhikeshava Cinema

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు వచ్చాయి . ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ సినిమా కి మంచి టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆదికేశవ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

"వైష్ణవ్‌తేజ్‌ యొక్క ఆదికేశవ ట్రైలర్‌
Adhikeshava Cinema

ఇప్పుడు తాజాగా నవంబర్ 24వ తేదీన ఈ ఆది కేశవ సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో ఈ సినిమా పైన హైప్ పెంచడానికి ఆదికేశవ ట్రైలర్ సినిమాను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అల్లరి ముఖాగా తిరిగే యువకుడు ఆ తర్వాత హీరోయిన్ ని చూసి ప్రేమలో పడి విలన్ గా వచ్చేవారిని ఎదుర్కొనడం జరిగినట్టుగా చూపించాడు . రెగ్యులర్ గా మాస్ హీరో చేసే కమర్షియల్ మూవీ తరహాలోనే ఈ ఆదికేశవ సినిమా ట్రైలర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

 

మీరు కూడా ట్రైలర్ ని ఒక లుక్ వేయండి : https://youtu.be/vA1DXbjnR6Q