టైగ‌ర్ కేసీఆర్ ఫస్ట్ లుక్…బాబు, లోకేష్, లగడపాటి…బాబు బర్త్ డే గిఫ్ట్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్మ మరో కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ ఉంటారని తెలిపారు. వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఉంటారని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తానని పేర్కొన్న వర్మ చంద్రబాబు పుట్టిన రోజు అంటూ ఈరోజు తను పాత పాడుతున్న వీడియో రిలీజ్ చేశారు.మా బాష మీద నవ్వినవ్, మా ముఖాల మీద ఊసినవ్, మా బాడీల మీద నడిసినవ్…ఆంధ్రోడా..వస్తున్నా…వస్తున్నా…వస్తున్నా… మీ తాట తియ్యనీకి వస్తున్నా…టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ వర్మ పాడిన పాట హలైట్ గా నిలుస్తోంది. ఈ సినిమా ఎన్ని వివాదాలకి కారణం అవుతుందో మరి ? వేచి చూడాలి.