జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్స్ !

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు ముందు వరకు జరిగిన బుకింగ్స్ తో యావరేజ్ గా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు అని అంచనా వేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా అంచనాలను మించే విధంగా జోరు చూపింది. మొదటి ఆట నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ అగ్ర నటులు నాని నటనను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు వాల్డ్ వైడ్‌గా రూ.7 కోట్లు రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమా ఒక లక్ష 45 వేల డాలర్స్‌ను రాబట్టినట్టు సమాచారం. సినిమా మొత్తం మీద మొదటి రోజు ట్రేడ్ అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది.