కేసీఆర్ నాన్నకి…శ్రీ రెడ్డి అనే అభాగ్యురాలయిన కూతురు లేఖ !

Srireddy Comments About Kollywood Stars

నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓపెన్ లెటర్ రాసింది. అది కూడా కేసీఆర్‌ని నాన్న అంటూ మీ కూతురు శ్రీరెడ్డి వ్రాయునదని నాలుగు పేజీల లేఖను తన స్వహస్తాలతో రాసింది శ్రీరెడ్డి. ఆమె రాసిన లేఖ ప్రకారం ‘నాన్నగారూ.. ఈ మాటతో మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండు కుండలుగా అయిపోయాయి. ఈ మాట, పిలుపుకు దూరమై దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది’ అంటూ ఈ లేఖకి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి.
‘గౌరవనీయులైన.. ఉద్యమాన్ని ఊపిరిగా బతికి తెలంగాణ మొత్తానికి తండ్రి సమానులైన మా ప్రియతమ, ప్రాణ సమానులైన మా తండ్రి కేసీఆర్ గారికి నమస్కరించి మీ పాదాలను ప్రార్దిస్తూ శ్రీరెడ్డి అను కూతురు సమానురాలైన నేను వ్రాస్తున్న ప్రార్ధనా పూర్వక లేఖ’.. అంటూ మొదలుపెట్టిన ఈ లేఖలో ముఖ్యంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావించింది శ్రీరెడ్డి. అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ఎలా వేధిస్తున్నారు.. వాళ్లను ఎలా వాడుకుని సెక్స్‌కి బానిసలుగా చేస్తున్నారు? తెర వెనుక ఎలాంటి బాగోతాలు నడుస్తున్నాయి తదితర విషయాల్ని ప్రస్తావించింది శ్రీరెడ్డి.