గ్రాండ్ గా జరిగిన వరుణ్, లావణ్య ల వివాహం…

గ్రాండ్ గా జరిగిన వరుణ్, లావణ్య ల వివాహం...
Cinema News

యువ నటుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి నేడు పలువురు కుటుంబసభ్యుల సమక్షంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి నేడు ఘనం గా పెళ్లి చేసుకున్నారు.

గ్రాండ్ గా జరిగిన వరుణ్, లావణ్య ల వివాహం...
Varun Tej, Lavanya

మూడు రోజుల నుండి వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో చాలా వైభవంగా ప్రారంభం కాగా ముందుగా కాక్ టెయిల్ పార్టీ ని, అనంతరం హల్దీ, మెహందీ ఫంక్షన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక అసలు ఘట్టమైన పెళ్లిని మరింత వైభవంగా నిర్వహించారు . కాగా ఆ నూతన వధూవరుల ఫోటోలు కొద్దిసేపటి క్రితం నుండి సోషల్ మీడియాలో వైరల్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక పలువురు ప్రేక్షకాభిమానులతో పాటు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వరుణ్, లావణ్య లకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.