తొలిప్రేమ వర్సెస్‌ గాయత్రి

varun tej to clash with Mohan Babu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒక్కటి ‘తొలిప్రేమ’. అదే టైటిల్‌తో ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను దిల్‌రాజు దక్కించుకున్న విషయం తెల్సిందే. దిల్‌రాజు ఈ చిత్రంపై ఉంచిన నమ్మకంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇటీవలే విడుదల అయ్యింది. ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ‘తొలిప్రేమ’ విడుదల కాబోతున్న తేదీలోనే అంటే ఫిబ్రవరి 9న మోహన్‌బాబు నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

varun-tej

విభిన్న కథా చిత్రా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మదన్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మధన్‌ ఈ చిత్రాన్ని విభిన్న స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

gayathri-movie

తొలిప్రేమకు పోటీగా ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు చిత్రాల కలెక్షన్స్‌పై ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటున్నారు. తొలిప్రేమ టైటిల్‌ కారణంగా వరుణ్‌ తేజ్‌ సినిమాకు కాస్త వెయిట్‌ ఎక్కువ ఉన్నా కూడా మోహన్‌బాబును తక్కువ అంచనా వేయలేం. తప్పకుండా ఫిబ్రవరి 9న రెండు చిత్రాల మద్య గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు.