‘హలో’ సూపర్‌ హిట్‌… అఖిల్‌ హ్యాపీ

Akhil Hello movie Trailer crossed 10 million Views

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 22న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అఖిల్‌ మొదటి చిత్రం డిజాస్టర్‌ అయ్యింది. ఆ సినిమా అనుభవంతో కాస్త జాగ్రత్తగా ‘హలో’ చిత్రాన్ని అఖిల్‌ చేయడం జరిగింది. నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని అఖిల్‌ రెండవ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను కలిగిస్తున్నాయి. ఇక ఈ చిత్రం విడుదల కాకుండానే సక్సెస్‌ అంటూ అఖిల్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇటీవల ‘హలో’ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ఆ ట్రైలర్‌ ఏకంగా పది మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘హలో’ ట్రైలర్‌ భారీ వ్యూస్‌ను దక్కించుకోవడం పట్ల అఖిల్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా హలో సూపర్‌ హిట్‌, కోటి వ్యూస్‌ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న అఖిల్‌ ట్రైలర్‌ వ్యూస్‌తో సంబరపడుతున్నాడు. అఖిల్‌కు జోడీగా ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. జగపతిబాబు మరియు రమ్యకృష్ణలు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

‘మనం’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఈయన తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే హలో కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్‌ మరియు ఫ్యామిలీ వ్యక్తం చేస్తున్నారు. హలో చిత్రంపై అఖిల్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం కూడా తారు మారు అయితే అఖిల్‌ కెరీర్‌ నిలవడం కష్టమే అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.