టాప్ లో ట్రెండ్ అవుతోన్న వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్

టాప్ లో ట్రెండ్ అవుతోన్న వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్
Cinema News

విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లింగ్ పాన్ ఇండియా చిత్రం సైంధవ్. ఈ సినిమా లో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, బేబీ సార, ఆర్య, యాండ్రియా, ముకేశ్ రుషి, రుహాణి శర్మ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రానున్న 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి జనవరి 13న రానుంది.

టాప్ లో ట్రెండ్ అవుతోన్న వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్
Saindhav Movie

ఇక ఈ సినిమా యొక్క టీజర్ ని నిన్న గ్రాండ్ గా ఈవెంట్ ద్వారా లాంచ్ చేసారు మేకర్స్. మంచి యాక్షన్ థ్రిల్లింగ్ హంగులతో పాటు ఆకట్టుకునే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, వెంకటేష్ సూపర్ యాక్టింగ్, డైలాగ్స్ తో అలరించిన ఈ టీజర్ ప్రస్తుతం 7 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ లో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా సంక్రాంతికి రిలీజ్ కానున్న తమ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేసారు .