పవన్‌ మూవీలో వెంకీ ఏంటి?

Venky Guest Roll in Pawan Kalyan movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Venky Guest Roll In Pawan Kalyan Movie

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌లు కలిసి డాలీ దర్శకత్వంలో ‘గోపాల గోపాల’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ఒక సినిమాకు అది రీమేక్‌. తెలుగులో పెద్దగా ఆడకపోయినా కూడా స్టార్‌ మల్టీస్టారర్‌ మూవీ అవ్వడంతో అంతా గుర్తుంచుకున్నారు. ఆ సినిమాలో వెంకీ, పవన్‌ల కాంబో సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా కోసం పవన్‌ మరియు వెంకీలు స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న భారీ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కథలో కీలకమైన ఒక పాత్రలో వెంకీ కనిపిస్తాడని సమాచారం. కథ విన్నప్పుడే ఆ పాత్రకు వెంకటేష్‌ అయితే బాగుంటుందని దర్శకుడితో పవన్‌ అన్నట్లుగా సమాచారం. పవన్‌తో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా వెంటనే వెంకీ గెస్ట్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. పవన్‌ సినిమాల్లో ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తాయి. మొదటి సారి పవన్‌ సినిమాలో మరో హీరో గెస్ట్‌గా కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు

ప్రభాస్‌ను పొడిచేసిన బాలీవుడ్‌ హీరో

ఎన్టీఆర్‌కు మరో అవార్డు