సల్మాన్ కి వెంకీ మామ పుట్టినరోజు శుభాకాంక్షలు!

సల్మాన్ కి వెంకీ మామ పుట్టినరోజు శుభాకాంక్షలు!
Cinema News

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ స్టార్ హీరో కి ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు. ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా చేరిపోయారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు వెంకీ మామ. మేరా భాయ్ మేరా జాన్, హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పుకొచ్చారు.

సల్మాన్ కి వెంకీ మామ పుట్టినరోజు శుభాకాంక్షలు!
Venkatesh, Salman Khan

వెంకటేష్ షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఏడాది సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించారు. అదే విధంగా వెంకటేష్ ఈ సంక్రాంతి కి సైంధవ్ గా థియేటర్ల లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.