ప్రముఖ నటుడు రిషి కపూర్ అస్తమయం

బాలీవుడ్ కు వరసగా విషాద చాయలు అలముకుంటున్నాయి. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే అలనాటి ప్రముఖ స్టార్ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అసలు బాలీవుడ్ కి ఏమైంది అనే ఆందోళన నెలకొంది. వరుస మరణాలతో బాలీవుడ్ షాక్ కి గురైంది. నిన్ననే స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మృతి చెందగా.. అంతకు నాలుగు రోజుల ముందే అయన తల్లి మరణించింది. ఈ రెండు విషాదాల నుంచి బాలీవుడ్ పరిశ్రమ కోలుకోక ముందే మరో దుర్వార్త బాలీవుడ్ కు కలవరపాటుకు గురిచేసింది.

అలనాటి స్టార్ నటుడు రిషికపూర్ కాసేపటి క్రితం మృతి చెందాడన్న వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితమే రిషి కపూర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. వీరి మరణం పట్ల అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.