చాలా సంతోషంగా ఉన్న విజయ్ దేవరకొండ

చాలా సంతోషంగా ఉన్న విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్సాన్స్‌ వస్తుండటంతో చిత్రయూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ “ఫన్ స్టాస్టిక్” సెలెబ్రేషన్స్ ని మీడియా తో పంచుకుంది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ`ఈ సినిమాకు హీరో షామీర్. నిన్న థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే మేం ముందు అనుకున్నది నిజమైంది. మా రౌడి బాయ్స్ , గళ్స్‌కు చాలా థ్యాంక్స్ . వాళ్ల వల్లే సినిమా బాగా ఆడుతుంది` అన్నారు

దర్శకుడు షామీర్ సుల్తాన్ మాట్లాడుతూ`అందరికి థ్యాంక్యూ. అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న మూడు థియేటర్లకు వెళ్లాం. ప్రేక్షకులందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. దీని కోసమే రెండేళ్లు కష్టపడ్డాను. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. రైటింగ్‌లో తరుణ్ నాకు చాలా సహకరించారు. అభినవ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు తెగనవ్వేస్తున్నారు. ఇంత నవ్వుకోడానికి నా కోడైరెక్టర్ అర్జున్ కారణం. నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను` అన్నారు.

హీరోగా మారిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ `నిన్న నాకు చాలా మంచి రోజు. ప్రేమతో ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ పని విజయవంతమవుతుంది. ఆ ఇష్టంతో విజయ్ చేసిన పనికి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలు పగలపడి నవ్వుతున్నారు. ఈ మూమెంట్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్యూ. విజయ్ ఎప్పుడు డైరెక్షన్ చేయాలనుకున్నా నేను నిర్మాతగా ఉంటా` అన్నారు.