విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న రకుల్

విజయ్-దేవరకొండ-పై-మనసు-పా

వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ అప్పటి నుండి ఇప్పటివరకు ఎక్కడా తడబడకుండా తన జర్నీని కొనసాగిస్తుంది. తెలుగులో ఉన్న దాదాపు యువ హీరోల అందరి పక్కన తన అందాలు ఆరబోసింది. నాగార్జున లాంటి సీనియర్ హీరోస్ పక్కన నటించి మెప్పించింది. ఇంతవరకు తెలుగు తమిళ ఆడియన్స్ కి మాత్రమే పరిచయం ఉన్న రకుల్ ఇప్పుడు హిందీలో కూడా నటించి తన సత్తా చాటుతుంది.

ఎప్పుడూ తన ఫిజిక్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకునే రకుల్ దానికి కారణం డైటింగ్ మాత్రం కాదంటుంది. తనకు ఇష్టమైనవి అన్నీ తింటూ ఉంటానని అంతేకాని ఒళ్ళు వస్తుందన్న భయంతో నోరు కట్టుకుని కూర్చోనని ఆమె చెప్పింది. కానీ ఎంత తిన్నా దానికి సరిపడే ఎక్సర్సైజ్ చేస్తానని ఆమె తన గ్లామర్ సీక్రెట్ బయట పెట్టింది.

తనకు కాబోయే భర్త కూడా ఎలా ఉండాలో రకుల్ చెప్పింది. ఆరడుగుల ఎత్తు ఉండాలని తెలివైన వాడై ఉండాలని అలాంటి వాడు దొరికే వరకు ఎదురు చూస్తానని అంటోంది. అంతేకాదు ఇప్పుడున్న హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ మీద క్రష్ ఉందని అసలు నిజాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళ్ లో ‘భారతీయుడు 2’ హిందీలో ‘మార్జవా’ సినిమాలు చేస్తుంది.