మనసులోని భావాలను పాట రూపంలో పునర్నవి కి వెల్లడించిన రాహుల్

మనసులోని భావాలను పాట రూపంలో పునర్నవి కి వెల్లడించిన రాహుల్
11వ వారం నామినేషన్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టాలు ఉండగా.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ కాగా.. అందరూ ఊహించినట్టుగానే రెండో కంటెస్టెంట్‌గా వరుణ్ సేఫ్ అయ్యారు. ఇక మహేష్ విట్టా, పునర్నవిల మధ్య ఉత్కంఠ కలిగించగా చివరికి మహేష్ విట్టా సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున.
ఇక హౌస్ నుండి బయటకు వస్తూ భావోద్వేగానికి గురైంది పున్నూ. అయితే అందరూ రాహుల్‌తో ఏం చెప్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అతనికి చెప్పకుండానే బయటకు వచ్చేసింది పునర్నవి. రాహుల్ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా.. వద్దు అంటూ సీరియస్ అయ్యింది. అయితే పునర్నవి బయటకు వచ్చిన తరువాత కన్నీటి పర్యంతం అయ్యాడు రాహుల్. ఇన్నాళ్లూ నవ్వుతూ నవ్విస్తూ హౌస్‌లో ఉన్న రాహుల్.. పునర్నవి వెళ్లిపోవడంతో తట్టుకోలేక ఏడ్చేశాడు.

ఎలిమినేషన్ తరువాత బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన పున్నూ ఫుల్ ఖుషీతో కనిపించింది. తన జర్నీని చూసి మురిసిపోయింది పున్నూ. ముఖ్యంగా వరుణ్‌తో రొమాంటిక్ సీన్లను చూసి మురిసింది.ఇక రాహుల్ లోపల ఫొటో అడిగితే ఎందుకు ఇవ్వలేదని నాగార్జున అడగ్గా.. ‘ఎవరు ఏమనుకున్నా తనూ నేను మంచి ఫ్రెండ్స్.. కాని గత రెండు వారాలుగా అతను నా ఫ్రెండ్ షిప్‌కి విలువ ఇవ్వలేదు.. అందుకే నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చింది పున్నూ. మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే ఛాన్స్ ఇస్తే తప్పుకుండా వెళ్తానంది పునర్నవి.

పునర్నవి వెళ్లిపోవడంతో ‘ఏమైపోతానే’ అనే పాటను అందుకుని గుక్కపెట్టి ఏడ్చేశాడు రాహుల్. ఎంతమంది కంట్రోల్ చేయాలని చూసినా దు:ఖ సాగరంలో మునిగిపోయాడు రాహుల్.