ట్యాక్సీవాలా లీక్‌ ఎఫెక్ట్‌ ఉంటుందా?

Vijay Deverakonda Taxiwala Movie

విజయ్‌ దేవరకొండ ‘నోటా’ చిత్రం తర్వాత ట్యాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నోటా చిత్రంతో ఫ్లాప్‌ అయిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ఖచ్చితంగా సక్సెస్‌ను దక్కించుకుంటాడు అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ట్యాక్సీవాలా చిత్రం లీక్‌ అవ్వడంతో సినిమా యూనిట్‌ సభ్యులు టెన్షన్‌ పడుతున్నారు. సినిమా లీక్‌ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సినిమా వేడుకలో కూడా సినిమా లీక్‌ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు. అయితే లీక్‌ అయినంత మాత్రాన తమ సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ సినీ వర్గాల వారు చెప్పుకొచ్చారు.

ట్యాక్సీవాలా లీక్‌ ఎఫెక్ట్‌ ఉంటుందా? - Telugu Bullet

గతంలో లీక్‌ అయిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అత్తారింటికి దారేది నుండి గీత గోవిందం వరకు విడుదలకు ముందు కొన్ని సీన్స్‌ లేదా కొన్ని షాట్స్‌ లేదా మొత్తం సినిమా లీక్‌ అయ్యాయి. అయినా కూడా ఆసినిమాలు బాగున్నాయి. సినిమా కంటెంట్‌ పరంగా బాగుంది, ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఖచ్చితంగా సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వస్తాయి. అలా పాజిటివ్‌ రివ్యూలు వస్తే సినిమా కలెక్షన్స్‌ పీక్స్‌ లో ఉంటాయి అంటూ చెప్పనక్కర్లేదు. గీత గోవిందం లీక్‌ అయినా కూడా 100 కోట్లను వసూళ్లు చేసి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అదే సెంటిమెంట్‌ ఈ చిత్రానికి కూడా వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.