టాక్సీవాలా ట్రైలర్.. అరవ సినిమా ఎత్తేశారా..!

taxiwala vijay devarakonda

యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ నోటా తర్వాత చేస్తున్న సినిమా టాక్సీవాలా. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న మూవీ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విజయ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే సరదాగా జీవితం సాగిస్తున్న ఓ కుర్రాడి లైఫ్ లో కారు సృష్టించిన హంగామానే టాక్సీవాలా సినిమా కథ అని తెలుస్తుంది.

టాక్సీవాలా ట్రైలర్.. అరవ సినిమా ఎత్తేశారా..! - Telugu Bullet

హర్రర్ థ్రిల్లర్ తో పాటుగా సినిమాలో కామెడీ కూడా ఉండేట్టు జాగ్రత్త పడ్డారు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా కచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రైలర్ చూశాక కోలీవుడ్ లో నయనతార లీడ్ రోల్ లో చేసిన డోరా సినిమాకు పోలిక పెట్టేస్తున్నారు. అందులో కూడా కారు వల్ల హీరోయిన్ కష్టాలపాలవుతుంది. ఇందులో హీరో కూడా సేమ్ టూ సేమ్ కారు కొన్ననాటి నుండి కష్టాలను ఎదుర్కుంటాడు. మరి డోరా కథతోనే టాక్సీవాలా తీశారా అన్నది చూడాలి. విజయ్ జీవితంతో కారు చేసే హంగామా ఎలా ఉంటుందో నవంబర్ 17న థియేటర్ లో చూడాల్సిందే.