ముద్ర వేసేందుకు వస్తున్న నిఖిల్..!

Nikhil As A Journalist In Mudra

యువ హీరోల్లో కొత్త ప్రయత్నాలు చేస్తూ సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటున్న నిఖిల్ కిరాక్ పార్టీతో అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం అతను హీరోగా వస్తున్న సినిమా ముద్ర. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కణిథన్ కు రీమేక్ గా వస్తున్న ఈ ముద్ర సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. యువ హీరోల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న నిఖిల్ కు ఈ ముద్ర సినిమా కచ్చితంగా మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు.

ముద్ర వేసేందుకు వస్తున్న నిఖిల్..! - Telugu Bullet

ఈ సినిమాకు సంబందించి నిఖిల్, లావణ్య త్రిపాఠిల పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో లావణ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. మాత్రుక దర్శకుడు టి.ఎన్.సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల మీడియా ఎలా బాధ్యత తీసుకుంది అని చెప్పే కథతో ఈ ముద్ర చిత్రం తెరకెక్కుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత నిఖిల్ చేసిన కేశవ, కిరాక్ పార్టీ రెండు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరి ఈ ముద్ర అయినా నిఖిల్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

ముద్ర వేసేందుకు వస్తున్న నిఖిల్..! - Telugu Bullet