ప్రభాస్ లో మూవీ లో విజయ్ దేవరకొండ?

ప్రభాస్ లో మూవీ లో విజయ్ దేవరకొండ?
Cinema news

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా సినిమా కల్కి 2898 ఏడీ . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమా ఏడాది మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే.. ‘కల్కి 2898AD’ మూవీ గురించి టీటౌన్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘సలార్’ తో సక్సెస్ అందుకున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898AD’ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిధి పాతలో నటిస్తున్నారట. షూటింగ్ లోను పాల్గొంటున్నట్లు టాక్. కాగా,ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే , దిశా పటానీ, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది .ఈ సినిమా ని సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.