National Politics: మరోసారి లాలూ, తేజస్వి యాదవ్‌లకు ఈడీ నోటీసులు..

National Politics: Once again ED notices to Lalu, Tejaswi Yadav..
National Politics: Once again ED notices to Lalu, Tejaswi Yadav..

2004 నుంచి 2009 మధ్య కాలంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో చాలా మంది గ్రూప్ ‘డి’ స్థానాల్లో నియమితులయ్యారని, దీని కోసం వారు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు, కంపెనీకి చెందిన కంపెనీకి బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు పాట్నా కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా నోటీసులు జారీ చేశారు.భూములు తీసుకుని బదులుగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలతో ఈడీ విచారించనుంది.

ఇక, జనవరి 29న లాలూ ప్రసాద్ యాదవ్, జనవరి 30న తేజస్వీ యాదవ్‌లు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ బీహార్ సీఎం రబ్రీ దేవి నివాసంలో ఈడీ అధికారుల బృందం సమన్లను అందజేశారు. ఇదే కేసుకు సంబంధించి వీరిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసేందుకు 2023, డిసెంబర్‌లోనూ ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ వారు హాజరు కాలేదు. ఈ కుంభకోణము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్టు ఆరోపణలున్నాయి.