విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్న నెటిజన్లు

విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తున్న నెటిజన్లు

చంద్రబాబు ఫై మరొకసారి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కియా మోటార్స్ గురించి రాయిటర్స్ లో అసత్య ప్రచారం చేసారని తాజాగా ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మీడియా ని మేనేజ్ చేసినోళ్లకు జాతీయ మీడియా ఒక లెక్కా అని అన్నారు. సంపాదించిన లక్షల కోట్లల్లో ఉల్లిపొరంత ఖర్చు పెడితే నిత్యం ఎదో కుట్రని ప్రచారంలో పెట్టొచ్చు అని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య విషయంలో జగన్ తీరుని ఎండగడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.