ఉద్యోగాల విషయంలో కొన్ని కీలకమైన వాఖ్యలు

ఉద్యోగాల విషయంలో కొన్ని కీలకమైన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నేడు రాష్ట్రానికి సంబందించిన ఉద్యోగాల విషయంలో కొన్ని కీలకమైన వాఖ్యలు చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ప్రాంతం పరిస్థితిపై తమకు అవగాహన ఉందని, విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఉద్యోగాలు రావనే విషయం తమకు కూడా తెలుసనీ వాఖ్యానించారు. అంతేకాకుండా సెక్రటేరియట్ వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని మంత్రి బొత్స ప్రశ్నించారు. కాకపోతే హైదరాబాద్ మహా నగరానికి ధీటుగా విశాఖని ఏర్పాటు చేయాలనీ ఆలోచన ఉందని చెప్పారు.

ఇకపోతే విశాఖ అభివృద్ధి చెందిన తరువాత ఓ రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో ఖర్చు చేస్తే, అది క్రమంగా మహానగరంగా ఎదుగుతుందని, అలాంటి తరుణంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండనిమాత్రం వెల్లడించారు. కాగా “విశాఖలో ఆఫీసు బిల్డింగ్ లు నిర్మించి, ఖాళీగా వదిలేయకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్క ప్రణాళికలతో అన్ని సదుపాయాలతో నిర్మించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారని మంత్రి బొత్స డత్యనారాయణ వెల్లడించారు.