డిసెంబ‌రులో కోహ్లీ పెళ్లి?

Virat Kohli and Anushka Sharma wedding

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ…అనుష్క శ‌ర్మ చాలాఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు కానీ పెళ్లి క‌బురు మాత్రం చెప్ప‌డం లేదు. అందుకే..వారి పెళ్లి ఎప్పుడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ లో కోహ్లీ , సినిమాల్లో అనుష్క టాప్ రేంజ్ కు ఎదిగిపోయారు కాబ‌ట్టి.. ఇక పెళ్లిచేసుకుని వారు జీవితంలో స్థిర‌ప‌డితే బాగుంటుంద‌న్న‌ది అభిమానుల కోరిక‌.  నిజానికి కోహ్లీ, అనుష్క త‌మ ప్రేమ‌ను అధికారికంగా ధృవీక‌రించ‌క‌ముందే…నాలుగేళ్ల క్రిత‌మే వారిద్ద‌రూ పెళ్లిచేసుకుంటార‌ని వార్త‌లొచ్చాయి. కానీ అనుష్క అప్ప‌ట్లో ఆ వార్త‌ల‌ను ఖండించిన‌ప్ప‌టికీ కోహ్లీతో ప్రేయాయ‌ణం కొన‌సాగించింది.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు వారి పెళ్లి గురించిన వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ ఆ జంట మాత్రం పెళ్లిపీట‌లెక్క‌డం లేదు. త్వ‌ర‌లోనే ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డన‌న్న‌ట్టు తెలుస్తోంది. ఈ డిసెంబ‌రులో వారిద్ద‌రూ పెళ్లిచేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల డిసెంబ‌రులో క్రికెట్ నుంచి  విశ్రాంతి ఇవ్వ‌మ‌ని కోహ్లీ బీసీసీఐని కోరడంతో ఈ పుకార్లు బ‌య‌లుదేరాయి. పెళ్లికోస‌మే కోహ్లీ విరామం కోరాడ‌ని భావిస్తున్నారు. ఇటీవ‌లే కోహ్లీ, అనుష్క క‌లిసి ఓ వ‌స్త్ర విక్ర‌య సంస్థ ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. సంప్ర‌దాయ దుస్తుల్లో ఓ పెళ్లికి హాజ‌రైన‌ట్టుగా ఉన్న ఆ యాడ్ త‌ర్వాత‌..వారి పెళ్లి ఊహాగానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.   డిసెంబ‌రు చివ‌రివారంలో భార‌త క్రికెట్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు ముందుగానే అనుష్క‌ను పెళ్లాడాల‌ని భావిస్తున్న కోహ్లీ శ్రీలంక‌తో వ‌న్డే, టీ20 సిరీస్ ల నుంచి విశ్రాంతి కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రెండు కుటుంబాల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.