హిట్ వెనుక ఉన్నఅర్ధం చెప్పిన విశ్వక్ సేన్

హిట్ వెనుక ఉన్నఅర్ధం చెప్పిన విశ్వక్ సేన్

ఫలక్ నూమా దాస్ చిత్రం తో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇపుడు హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇటీవల విడుదల అయిన హిట్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం పేరు గురించి ప్రేక్షకుల్లో చాల ప్రశ్నలు ఏర్పడ్డాయి. అందులో మొదటిది హిట్ అంటే ఏంటి అని. అయితే ఈ హిట్ వెనుక ఒక అర్ధం ఉందని చిత్రం బృందం తాజాగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

అయితే ఈ ప్రోమోలో విశ్వక్ సేన్ ఒక కేసు కు సంబందించిన వివరాలు వెల్లడిస్తూ కనిపించారు. అయితే ఈ కేసు వివరాలను హిట్ లో పెట్టనున్నట్లు తెలపగా, సర్ హిట్ అంటే ఏంటి అని అడుగుతారు. దానికి హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అని తెలుపుతారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఈ నెల 28 న విడుదల కానున్న హిట్ చిత్రం ఫై విశ్వక్ సేన్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.