అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పండి

అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పండి

మాస్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్‌, హిట్‌, పాగల్‌ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా నటిస్తున్నాడు. ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించినట్లుగా ఆమధ్య ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు.

తాజాగా విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం పడేయటానికి టిప్స్‌ అయినా ఇవ్వండి. వయసు 30 దాటింది. పొట్ట, జుట్టు.. చాలా కష్టాలున్నాయి. ఇంకా రెండే రోజులుంది. ఒకే ఒక్క సంబంధం చూడండి. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయం చేయండి. ఇంతకీ రెండు రోజులు డెడ్‌లైన్‌ ఎందుకిచ్చినట్లు? సినిమా నుంచి ఏదైనా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్‌ లాంచ్‌ చేయబోతున్నారా? లేదా పిల్ల దొరికేసిందని ఫొటో చూపిస్తారా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు.