వితిక ని కింద పడేసిన బిగ్ బాస్

వితిక ని కింద పడేసిన బిగ్ బాస్

నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్‌ టాస్క్‌ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్‌ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్‌ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. టాస్క్‌లో సేకరించే రాళ్లతో వంట సామాగ్రిని కొనుక్కొని భోజనం సిద్ధం చేసుకోవాలి. ఇక వంటసామాగ్రి ఖరీదు చూసి ఇంటిసభ్యులు గుడ్లు తేలేశారు. రూపాయి అగ్గిపెట్టె కూడా రూ.500 ఉంది. దీంతో ఇంటిసభ్యులు తిండి కోసం నానా తంటాలు పడ్డారు.

ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో  రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది. దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్‌.. అలానే జరుగుతుంది, టాస్క్‌లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్.. వితికపై ఫైర్‌ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు. వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్‌.. ఎందుకు తనపై అంతలా సీరియస్‌ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. ​