ఆవు మీద రేప్ : నిందితుడి అరెస్ట్ !

Man arrested for raping a cow

కామాంధులు రెచ్చిపోతున్నారు, ఇటీవలే హర్యానాలో ఒక గర్భంతో ఉన్న మేక మీద 8 మంది అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరవక ముందే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక వ్యక్తి అదే హర్యానాలోని రాజ్‌గఢ్‌ జిల్లా సుతాలియా ప్రాంతంలో ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి స్ధానిక వ్యాపారి మహేష్‌ అగర్వాల్‌ ఇంటికి తిరిగివస్తుండగా ఆవుపై ఓ ప్రబుద్ధుడు ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడటం గమనించి ఆ ప్రబుద్దుడిని ఛోటేఖాన్‌గా గుర్తించారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే ఈ ఘటన గ్రామంలోని దేవాలయం సమీపంలో జరగడం. ఈ ఘటనకు నిరసనగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఛోటేఖాన్‌ ని అరెస్ట్ చేసి అతని మీద కటిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లతో రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులకు దర్యాప్తు అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. నిందితుడు ఛోటే ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు.