మినిమం బ్యాలెన్స్ మీద ఎస్బీఐ కీలక ప్రకటన !

sbi says nearly 40 savings accounts exempted minimum balance rules

కొద్ది రోజుల ఎస్‌బీఐ మధ్యతరగతి జీవుల నుండి భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సదరు కథనాలపై ఎస్‌బీఐ స్పందించింది. అంతేకాక మినిమమ్ బ్యాలెన్స్‌లపై కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే మినిమమ్ బ్యాలెన్స్‌లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 40 శాతం తగ్గించామని 40 శాతం సేవింగ్స్‌ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని తెలిపింది.

వీటితో పాటు ప్రభుత్వ ఫైనాన్సియల్‌ ఇంక్లూజన్‌ స్కీన్‌ జన్‌ ధన్‌ యోజన, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్‌ సెక్యురిటీ బెనిఫిట్‌ హోల్డర్స్‌ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్‌బీఐ ప్రకటించింది. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ లేదన్న సాకుతో ఖాతాదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని బ్యాంకింగ్‌ డేటాలో వెల్లడైన సంగతి తెలిసిందే.