దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ హీరోగా..!

Gautham Menon turns hero

‘ఏమాయ చేశావే’ చిత్రంతో పాటు తెలుగులో ఎన్నో చిత్రాలను తెరకెక్కించి సూపర్‌ హిట్‌లను దక్కించుకున్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. ఈయన తమిళంలో తెలుగులో మంచి సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఈయన ప్రస్తుతం తమిళంలో అనుష్క ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటూనే మరో దర్శకుడి దర్శకత్వంలో హీరోగా నటించేందుకు ఈ దర్శకుడు సిద్దం అయ్యాడు. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

Gautham Menon turns hero

తమిళంలో రూపొందబోతున్న ఒక చిత్రంలో గౌతమ్‌ మీనన్‌ హీరోగా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు జై చెప్పిన కథ మరియు ఆ కథలోని హీరో పాత్ర నచ్చడంతో వెంటనే నటించేందుకు గౌతమ్‌ మీనన్‌ ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. గౌతమ్‌ మీనన్‌కు నటించాలనే ఆశ చాలా కాలంగా ఉంది. గతంలో రెండు మూడు చిత్రాల్లో ఈయన ముఖ్య పాత్రల్లో కనిపించాడు. మరి కొన్ని చిత్రాల్లో గెస్ట్‌ రోల్‌లో కూడా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా హీరోగానే ఈయన నటించేందుకు సిద్దం అవుతున్నాడు. దర్శకుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో దర్శకుడి దర్శకత్వంలో హీరోగా నటించాలని ఈయన నిర్ణయించుకున్నాడు. ఇలా చేయడం చాలా కష్టమే, అయినా కూడా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రంను చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.