మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలా ? ఇలా చెక్‌ చేసుకోవచ్చు..!

Want to know how many SIM cards are in your name? You can check like this..!
Want to know how many SIM cards are in your name? You can check like this..!

ప్రస్తుతం టెక్నాలజీదే రాజ్యం. ప్రతి పనీ టెక్నాలజీతో ముడిపడి నడుస్తోంది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎంత తెలివైన, తెలిసినవారైనా కూడా సైబర్‌ నేరాల మాయలో పడిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో. మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి కొంత మంది నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకెళ్తే..

మనకు అవసరం లేకపోయినా.. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత వాటిని పడేస్తుంటాం. ఇలాంటి నంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు .ఇటీవల విజయవాడలో ఒకే వ్యక్తి సంబంధించిన పేరుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) ద్వారా ప్రపంచానికి తెలిసింది. మీడియాలో, సోషల్‌ మీడియాలో కూడా బాగా చక్కర్లుకొట్టింది.

అయితే.. అయితే తాజాగా సిమ్ కార్డులపై టెలీకమ్యూనికేషన్ శాఖ (డాట్) పరిమితి విధించింది. 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులున్న ఒక వినియోగదారుడు మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీ యాక్టివేట్ చేయాలని డాట్ సూచించింది. ఒకవేళ తొమ్మిదికి మంచి సిమ్ కనెక్షన్లు ఉండాలనుకుంటే వినియోగదారుడు రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో టెలికామ్ సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌ తీసుకొచ్చింది. దీంతో ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా.. మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో అయినా నెంబర్ బ్లాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది.

ఇలా చెక్‌ చేసుకోవాలి:
సంచార్ సాతి అధికారిక వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/ ఓపెన్ చేయాలి
అందులో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొబైల్ నెంబర్ కనెక్షన్ సంబందించిన (TAFCOP) మీద క్లిక్ చేయాలి, తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది .తరువాత 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసిన తరువాత.. వచ్చిన ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే.. ఆ యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది.
అక్కడే మనది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.