Breaking News: ట్విట్టర్ వినియోగదారులకు అలర్ట్.. డౌన్ !

Breaking News: Alert to Twitter users.. down!
Breaking News: Alert to Twitter users.. down!

Breaking News: వినియోగదారులకు అలర్ట్..ట్విట్టర్ డౌన్ అయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ట్విట్ట‌ర్ Twitter యూజ‌ర్లు సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో కొత్త అప్డేట్స్‌.. రావడం లేదు. గత 3 గంటలుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

కొంద‌రు ట్విట్ట‌ర్‌లోకి లాగిన్ అవ‌లేక‌పోతున్నామ‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక కొంద‌రికి టైమ్ లైన్ ఫీచ‌ర్ రావ‌డం లేద‌ని, కొంద‌రికి ప్రొఫైల్ యాక్సెస్ అవ‌డం లేద‌ని అంటున్నారు. ఇక కంప్యూట‌ర్ల‌లో రావ‌డం లేద‌ని, కొందరు కేవ‌లం ఫోన్ల‌లోనే ట్విట్ట‌ర్ వ‌స్తుంద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు. మరి దీనిపై ట్విట్టర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.