వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Cinema News

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు . దేవర సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయడానికి సినిమా బృందం ప్లాన్ లో ఉందట. అందుకు అనుగుణంగానే షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నారట.

వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
war-2 Cinema

అయితే, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “వార్-2” చిత్రం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ సినిమా ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “వార్-2” లో హృతిక్ కి దీటుగా నెగిటివ్ షేడ్స్ తో కూడిన పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని సినీ వర్గాల సమాచారం.