ప్రపంచ కప్ టికెట్ లు అందుబాటు ఎప్పుడంటే ..?

When are the World Cup tickets available?
When are the World Cup tickets available?

క్రికెట్ వరల్డ్ కప్ 2023 అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న మరెన్నో రోజులు లేదు.అక్టోబర్ 5 నుండి నవంబర్ 23 వరకు మ్యాచ్ లు జరగుతాయని ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీన మొదటి మ్యాచ్ తో వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఐసీసీ మరియు బీసీసీఐ చర్చల అనంతరం ఈ రోజు కొత్త షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లో మొత్తం 8 మ్యాచ్ ల తేదీలు ముందుకు లేదా వెనక్కు మార్చబడ్డాయి. ఇక ఈ వరల్డ్ ఇండియాలోని మొత్తం పది వేదికలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ప్రేక్షకులు ఈ మ్యాచ్ లను చూడడానికి అనువుగా అన్ని ఏర్పాట్లను బీసీసీఐ సిద్ధం చేస్తోంది.. కాగా ఈసారి స్టేడియం లలో వాటర్ ను ఉచితంగా అందిస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఐసీసీ ఈ మ్యాచ్ ల టికెట్ లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒక అప్డేట్ ను ఇచ్చింది, ప్రపంచ కప్ టికెట్ లు ఆగష్టు 25వ తేదీ నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.