ఓటీటీలోకి వచ్చేసిన ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?

ఓటీటీలోకి వచ్చేసిన ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?
Cinema News

హలో మై పూజా బోల్ రహీ హూ.. ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చేది ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా. ఈ సినిమాతో ఆయుష్మాన్ మరోసారి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. బాలీవుడ్​లో ఈ నటుడి రూటే సపరేటు. చేసే ప్రతి సినిమాలో కొత్త దనాన్ని వెతుక్కుంటాడు. మూస ధోరణిలో ఒక్క మూవీ కూడా చేయని హీరో అంటే ఆయుష్మానే. సమాజంలో ఉన్న సమస్యలను హ్యూమర్​ యాడ్ చేసి.. దానిలోని సీరియస్​నెస్​ను ప్రజల మెదల్లోకి ఈజీగా ఎక్కించే సినిమాలు చేస్తుంటాడు. అలా 2019లో వచ్చిన సినిమా డ్రీమ్ గర్ల్. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్.

ఓటీటీలోకి వచ్చేసిన ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?
Dream Girl-2

ఈ క్రమంలో దీనికి సీక్వెల్ డ్రీమ్​గర్ల్-2 తెరకెక్కింది. అనన్యాపాండే కథానాయికగా.. రాజ్‌ శాండిల్యా దర్శకతర్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈరోజు నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది డ్రీమ్ గర్ల్-2. ‘‘ఇకపై మీ కలలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే డ్రీమ్‌ గర్ల్‌ రాబోతోంది’’ అని నెట్​ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఈ దసరా హాలిడేస్​ను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.