భార్య అక్రమ సంబంధం…ఐదుగురు పిల్లలను చంపి !

Wife's illicit affair ... killing five children!

పిల్లలను కంటిపాపలా చూసుకోవల్సిన తండ్రే వారి పాలిట రాక్షసుడయ్యాడు. కిరాతకంగా పిల్లలను చంపి.. ఆ శవాలతో ఊరంతా తిరిగాడు. చివరికి ‘డ్రంగ్ అండ్ డ్రైవ్’ టెస్ట్ చేస్తున్న పోలీసులకు చిక్కాడు.

తన భార్య అంటే ఆ పిల్లల తల్లి ఓ యువకుడి అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆమెపై ప్రతీకారం తీర్చుకోడానికే పిల్లలను చంపేశాడని తేలింది. నిజానికి పేదరికం వల్ల అంత మందిని పెంచలేక ఈ హత్యలు చేశాడని అంతా భావించారు.

కానీ, ఇటీవల కోర్టులో అతడు చెప్పిన షాకింగ్ నిజం విని అంతా నిర్ఘాంతపోయారు. అమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటుచేసుకుంది. తిమోతీ జోన్స్ జూనియర్ (36) అనే వ్యక్తి తన పిల్లలు మీరా (8), ఎలియాస్ (7), నటాన్ (6), గ్యాబర్రియల్ (2), అబిగైల్ (1) దారుణంగా కొట్టి చంపేశాడు.

అనంతరం వారి శవాలను చెత్త కవర్లలో పెట్టి తన ఎస్‌యూవీ కారులో పెట్టి సుమారు వారం రోజులు పాటు తిరిగాడు. చివరికి అలబామాలోని నిర్మానుష్య ప్రాంతంలో వాటిని పాతిపెట్టాడు.

కొద్ది రోజుల తర్వాత మిస్సిస్సిప్పి‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. అతడి వాసన పరిశీలించారు. అయితే, నోటి నుంచి కంటే.. కారు లోపల నుంచే ఎక్కువ దుర్వాసన రావడం గమనించారు.

అనుమానంతో కారును తనిఖీ చేయగా వెనుక సీట్లలో రక్తపు మరకలు, రసాయనాలు కనిపించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా తమదైన శైలిలో ప్రశ్నిస్తే అప్పుడు అసలు నిజం బయటపడింది