టీజర్‌ రివ్యూ : రికార్డులు బద్దలవ్వడం ఖాయం

Will Koratala Siva’s Bharat Ane Nenu Be Mahesh’s Career Best

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ ఏ రేంజ్‌లో సక్సెస్‌ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో టాప్‌ చిత్రాల జాబితాలో శ్రీమంతుడు చిత్రం నిలిచిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్‌ కారణంగా తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భరత్‌ అను నేను’కు భారీ క్రేజ్‌ ఏర్పడటం జరిగింది. కైరా అద్వానీ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మహేష్‌బాబు సీఎంగా నటించబోతున్నాడు అంటూ మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అదే విషయం తాజాగా టీజర్‌తో వెళ్లడైంది.

‘భరత్‌ అను నేను’ చిత్రం టీజర్‌ నిన్న సాయంత్రం నుండి సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతుంది. మహేష్‌బాబు డైలాగ్స్‌కు ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మహేష్‌బాబు ఈ చిత్రంతో తన స్టార్‌డంను మరింత పెంచుకోవడం ఖాయం అని టీజర్‌లోని విజువల్స్‌ చూస్తుంటే తేలిపోయింది. ఇక ఈ చిత్రంలో మహేష్‌బాబు పోషించబోతున్న ముఖ్యమంత్రి పాత్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు తెరలేపే అవకాశం ఉందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా, సినిమా కథ ఎలా ఉన్నా కూడా ‘భరత్‌ అను నేను’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఏప్రిల్‌ 20న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం కొరటాల, మహేష్‌ల కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ చిత్రంగా నిలవడం ఖాయం అని చెబుతున్నారు.