జనసేన-టీడీపీ పొత్తు కలిసొచ్చేనా ?..లాజికల్ గా ఆలోచిద్దాం !

AP Politics: TDP, Jana Sena complain to CEC over fake vote irregularities
AP Politics: TDP, Jana Sena complain to CEC over fake vote irregularities

టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా సరే గెలుపు తమదే అని..మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే అని, మళ్ళీ జగనే సి‌ఎం అని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అంటే ఇక్కడ పొత్తు కూడా ఫెయిల్ అవుతుందని వైసీపీ నమ్ముతుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది పొందిన విషయం వాస్తవం. దాదాపు 50 సీట్లలో ఓట్ల చీలిక ప్రభావం ఉంది. వైసీపీ గెలిచి 151 సీట్లు వచ్చాయి.

ఇప్పుడు జనసేన-టి‌డి‌పి కలిసాయి. దీంతో వైసీపీకి నష్టం. పైగా వైసీపీపై ఇప్పుడు వ్యతిరేకత ఉందని జనసేన,టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. అంటే ఇక్కడ ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ కొందరు విశ్లేషకులు పొత్తు సఫలమైతే మాత్రం వైసీపీకి నష్టమని, అదే సమయంలో విఫలమైతే వైసీపీకి లాభమని అంటున్నారు. విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ మధ్య సఖ్యత ఉంది తప్ప..టి‌డి‌పి, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేదని అంటున్నారు.

దాంతో రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ కావని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు జనసేనకు కేటాయించే సీట్లలో టి‌డి‌పి ఓట్లు పూర్తిగా బదిలీ అవ్వాలి..అటు టి‌డి‌పికి కేటాయించే సీట్లలో జనసేన ఓట్లు బదిలీ కావాలి.

కాకపోతే ఇక్కడ టి‌డి‌పి శ్రేణులతోనే రిస్క్. ఎందుకంటే టి‌డి‌పికి అన్నీ సీట్లలో కనీస బలం ఉంది. అలాంటప్పుడు జనసేనకు సీటు ఇస్తే..అక్కడ జనసేన వాళ్ళ పెత్తనం ఉంటుందని చెప్పి..తమ్ముళ్ళు ఓడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సీ-ఎస్టీ సీట్లలో ఆయా నేతలు పోటీచేస్తే..టి‌డి‌పిలోని అగ్రకులాల వారు మద్ధతు ఇవ్వరు.అందుకే రిజర్వ్ సీట్లలో టి‌డి‌పి ఓడిపోతుంది. ఇప్పుడు అదే పరిస్తితి జనసేనకు రావచ్చు. కాబట్టి పొత్తు ఫెయిల్ అవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది.