అమెరికా వెళ్లిన హీరోయిన్స్‌ అంతా అలా కాదు..!

young heroine talks about sex racket at america

అమెరికాలో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తుంది. తెలుగు హీరోయిన్స్‌కు వల వేసి, అమెరికాలో ఖరీదైన వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తిని అక్కడ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో చర్చ జోరుగా సాగుతుంది. తెలుగుకు చెందిన ఎంతో మంది హీరోయిన్స్‌ పలు సందర్బాల్లో అమెరికా వెళ్లడం జరిగింది. వారందరిని కూడా ప్రస్తుతం అనుమానిస్తున్నారు. గతంలో అమెరికాకు ఫంక్షన్స్‌కు అంటూ, కార్యక్రమాలకు అంటూ వెళ్లిన వారి గురించి సినిమా పరిశ్రమలో తప్పుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఒక చిన్న హీరోయిన్‌ ఆఫ్‌ ది రికార్డ్‌ మాట్లాడుతూ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుండి చిన్న హీరోయిన్స్‌ మరీ చీప్‌గా చూస్తున్నారు. జనాలు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

పదుల సంఖ్యలో అమెరికాలో వ్యభిచారం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో అమెరికాలో హైటెక్‌ వ్యభిచారం గురించి తెగ చర్చ జరుగుతుంది. స్టార్‌ హీరోయిన్స్‌ నుండి చిన్న హీరోయిన్స్‌ వరకు అంతా కూడా అక్కడ వ్యభిచారం కూపంలో చిక్కుకున్న వారే అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు మాత్రం అమెరికా వెళ్లిన ప్రతి ఒక్క హీరోయిన్‌ అలాంటి పని చేసిందని అనుమానించడం బాధాకరం, అందరిని ఒకేలా భావించి అనుమానించడం సరైన పద్దతి కాదు అంటున్నారు. మొత్తానికి అమెరికాలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదుతున్నట్లుగా ఉంది. కొందరు మాత్రం ఇప్పటికే ఓపెన్‌ అయ్యారు. తాము మోస పోయి వ్యభిచారం చేయవల్సి వచ్చిందని అమెరికా పోలీసులతో చెప్పుకొచ్చారు. ముందు ముందు మరింత కూపీలాగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది.