అరవింద సమేతకు ముహూర్తం ఫిక్స్‌

Aravinda Sametha Veera Raghava Movie release date fixed

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు విడుదల కాబోతుందని నిన్న మొన్నటి వరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను సాధిస్తుందని భావిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంను అక్టోబర్‌ 10న విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో దర్శకుడు షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం దసరాకు కాస్త అటు ఇటుగా వస్తుందని చెప్పినట్లుగానే త్రివిక్రమ్‌ విడుదలకు ప్లాన్‌ చేశాడు.

‘జైలవకుశ’ చిత్రం గత దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత చాలా ఎక్కువ గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత మాత్రం ఎక్కువ గ్యాప్‌ తీసుకోవడం లేదు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్‌, దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ హీరోయిన్‌ ఒక కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌లో నటించబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి ఆ మల్టీస్టారర్‌ను చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఆ చిత్రం వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.