ఉన్నావ్ లో మరో దారుణం : వదిలేయండి అన్న అన్నా సరే నీచంగా…

Youth attempt to rape a woman unnao

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ కేసు మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌కు చెందిన ఓ యువతిని ఇంటి సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్నానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఆ సమయంలో ఆమె ‘అన్నా నన్ను విడిచిపెట్టండి’ అని కాళ్ళు పట్టుకున్నా కనీస కనికరం చూపలేదు. ‘గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామని బెదిరించటం…’ దానికి ఆ మహిళ ‘అన్నా.. వదిలేయండని ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్న’ ఆ కామాంధులు కనికరించలేదు. కామాంధులు కనికరించకపోవటంతో చివరికి ఆ మహిళ ఎలాగోలా తప్పించుకుంది. ముగ్గురు యువకులు ఆ మహిళను అత్యాచారయత్నం చేయగా, మరో యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీశాడు. సహకరించకపోతే వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని ఆమెను బెదిరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలింపు చేపట్టారు.