రివ్యూలపై మండిపడ్డ డీజే

Allu Arjun serious on DJ reviews,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Allu Arjun Serious On DJ Reviews,

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక సినీ విశ్లేషకులు మాత్రం సినిమాను చీల్చి ఏకి పారేశారు. చాలా తక్కువ శాతం రివ్యూవర్స్‌ మాత్రమే ‘డీజే’ చిత్రం బాగుందని, పర్వాలేదు అంటూ రివ్యూలు ఇచ్చారు. ఎక్కువ శాతం వెబ్‌ మీడియాలో ‘డీజే’ చిత్రం ఫ్లాప్‌ అని, బిలో యావరేజ్‌ అంటూ రివ్యూలు వచ్చాయి. ఈ రివ్యూల వల్ల కలెక్షన్స్‌పై ప్రభావం క్లీయర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ‘డీజే’ రివ్యూలు ప్రభావం చూపాయి అనేది అంతా అంటున్న విషయం. తాజాగా ‘డీజే’ థ్యాంక్స్‌ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మరియు దర్శకుడు హరీష్‌ శంకర్‌లు నెగటివ్‌ రివ్యూలు ఇచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో అల్లు అర్జున్‌ నటించిన ‘సరైనోడు’ సినిమాకు కూడా నెగటివ్‌ రివ్యూలు తక్కువగా వచ్చాయి. అయితే ఆ రివ్యూలను అప్పుడు బన్నీ పట్టించుకోలేదు. కాని తాజాగా ఈ సినిమాకు ఎక్కువగా నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. దాంతో బన్నీ స్పందించాడు. ఈ చిత్రానికి నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి, నేను చూశాను. అయితే నేను ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తాను. అందుకే నెగటివ్‌ రివ్యూల గురించి పట్టించుకోను అన్నాడు. ఇక హరీష్‌ శంకర్‌ స్పందిస్తూ.. రివ్యూలు రాసే స్వేచ్చ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు. హరీష్‌ శంకర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయి అంటూ రివ్యూ రాశారు. నువ్వు ఎవడ్రా నన్ను కళ్లు నెత్తికి ఎక్కాయి అనేందుకు. రివ్యూలకు డీజే కలెక్షన్స్‌ సమాధానం ఇస్తున్నాయంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలను రివ్యూవర్స్‌పై హరీష్‌ శంకర్‌ చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు