జేసీ ఏడనున్నారో..? ఎక్కడున్నారో..?

Jc Divakar Reddy Missing

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జేసీ దివాకర్ రెడ్డి వీరంగానికి ఇండిగో సహా ఏడుకు పైగా ఎయిర్ లైన్స్ సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. అయినా సరే ఎంపీగారు దర్జాగా విదేశాలకు వెళ్లిపోయారు. అదే ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. అసలు ఎయిర్ లైన్స్ నిజంగా నిషేధం విధిస్తే ఆయన ఫారిన్ టూర్ ఎలా వెళ్లారా అని.. ఇక్కడ తలలు బద్దలైపోతున్నాయి. ఆయన ఫారిన్ ఎయిర్ లైన్స్ లో చెక్కేశారన్న మాట మాత్రం కాస్త కామెడీగానే అనిపిస్తోంది.

ఓవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏఫీ సీఎం చంద్రబాబు జేసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎయిర్ లైన్స్ కు తక్షణమే క్షమాపణ చెప్పాలని జేసీ దగ్గరకు దూతల్ని పంపారు. అందుకే తర్వాతి రోజు మీడియాకు జేసీ సారీ చెప్పారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ అధికారికంగా సారీ చెప్పకుండా.. అట్నుంచి అటే విదేశాలకు చెక్కేయడం బాబుకు కూడా నచ్చలేదు. జేసీ తిరిగొచ్చాక తలంటుతారని అనంత టీడీపీ నేతలు చెబుతున్నారు. 

జేసీ దివాకర్ రెడ్డి ఎంత సీనియర్ అయినా.. అందర్నీ రెచ్చగొట్టేలా మాడ్లాడుతున్నారని, ఏ పని మొదలుపెట్టినా.. ఇది అయ్యేదా.. చచ్చేదా అంటున్న ధోరణి కూడా బాబుకు నచ్చడం లేదు. జేసీని ఇలాగే వదిలేస్తే ఆయన్ను చూసి అందరూ నేర్చుకుంటారని నేతలు చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారట. అందుకే ఎయిర్ లైన్స్ వీరంగం సాకుతో జేసీ కొమ్ములు పీకేయాలని చూస్తున్నారు చంద్రబాబు.