బీజేపీ దెబ్బకు కాంగ్రెస్, సీపీఎం డీలా

BJP made congress and cpm down

స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచీ దేశంలో రెండే అతిపెద్ద రాజకీయ పార్టీలు. అవి కాంగ్రెస్, సీపీఎం. ఓ రకంగా తెరవెనుక ఈ రెండు పార్టీలకు ఒప్పందం ఉందనే ప్రచారం కూడా జోరుగా ఉంది. అయితే కాషాయ పార్టీ వచ్చాక ఆ పార్టీకి జాతీయ స్థాయి అనిపించుకోవడానికి ఇరవై ఏళ్లు పట్టింది. అలాంటి పార్టీ ఇప్పుడు వందేళ్లకు పైబడి చరిత్ర ఉన్న రెండు పార్టీల అడ్రస్ గల్లంతు చేసే పనిలో బిజీగా ఉంది.

హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో అధికారానికి బీజేపీ చేరువైంది. రాజధాని సిమ్లా మున్సిపాల్టీని గెలుచుకుని తొడ కొట్టారు అమిత్ షా. ఇక్కడ గతంలో కాంగ్రెస్, సీపీఎం బలంగా ఉండేవి, సీపీఎం అయితే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు అనుభవించింది. కానీ ఈసారి సింగిల్ కార్పొరేటర్ తో సరిపెట్టుకుంది. సిమ్లా మున్సిపల్ గెలుపు.. భవిష్యత్తులో బీజేపీ అసెంబ్లీ గెలుపుకు బాటలు వేసిందని విశ్లేషణలు బయల్దేరాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలో అయినా స్థానిక ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితమే అసలు ఎన్నికలో పునరావృతమౌతుంది. 2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీలో స్థానిక ఎన్నికల్లో సైకిల్ సత్తా చాటింది. అందుకే రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అనే బలమైన వాదన కూడా ఉంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో కూడా సేమ్ సీన్ రిపీటౌతుందని కమలనాథులు ఫుల్ జోష్ లో ఉన్నారు.