ఇవాంకాను స‌న్నీలియోన్ తో పోల్చిన వ‌ర్మ‌

Posted [relativedate] at [relativetime time_format=

ఇవాంకాను స‌న్నీలియోన్ తో పోల్చిన వ‌ర్మ‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌న సినిమాల క‌న్నా ఎక్కువ‌గా  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకెక్కే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌…మ‌రోసారి అదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప‌ర్య‌ట‌నకు హైద‌రాబాద్ ముస్తాబ‌వుతుండ‌డంపై వ‌ర్మ స్పందించారు. ఇవాంకాను బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ తో పోలుస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. త‌న‌కు రాజ‌కీయాల‌పై ఎలాంటి జ్ఞానం, అవ‌గాహ‌న‌లేద‌ని, ఇవాంకా హైద‌రాబాద్ లో ఎందుకు ప‌ర్యటించాల‌నుకుంటోందో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు. .

 
తాను మాత్రం ఆమె అందాన్ని చూడాల‌ని ఎంత‌గానో ఎదురుచూస్తున్నాన‌ని, గ‌తంలో స‌న్నీలియోన్ భార‌త్ వ‌చ్చిన‌ప్పుడు కూడా తాను ఇలాగే చాలా థ్రిల్ల‌య్యాను అని వ్యాఖ్యానించారు. ఈ నెల 28న హైదరాబాద్ లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్స్ స‌మిట్ కు ఇవాంకా హాజ‌రుకానున్నారు. ఇవాంకా కోసం తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో ప్ర‌త్యేక విందు ఏర్పాటుచేస్తున్నారు. ఇవాంకా ప‌ర్య‌ట‌న‌కోసం తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ను ప్ర‌త్యేకంగా ముస్తాబు చేయ‌డం ప‌దిరోజుల ముందు నుంచే భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయ‌డం వంటివి చూసి వ‌ర్మ ఇవాంకా ప‌ర్య‌ట‌న‌పై వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. అయితే వ‌ర్మ ఓ దేశాధ్య‌క్షుడి కుమార్తెను స‌న్నీలియోన్ తో పోల్చ‌డాన్ని నెటిజ‌న్లు త‌ప్పుప‌డుతున్నారు.