అంజనతో కలిసి క్యూట్ హీరోయిన్ నజ్రియా చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్

నేచురాల్ నాని ‘సుందర్’గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నాని హీరోగా.. నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. ఈ మూవీ జూన్ 10న బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని చాలా రోజుల తరువాత కామెడీ రోల్ పోషించాడు.
ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే షురూ చేయగా.. చిత్ర బృందం ఇంటర్వ్వూలతో బిజిబిజీగా గడుపుతోంది.

మలయాళ కుట్టి నజ్రియా నజీమ్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అంటే సుందరానికీ..!’ మూవీ ప్రమోషన్ సాంగ్‌కు నాని సతీమణి అంజన డ్యాన్స్ చేసింది. భార్యతో కలిసి నాని కూడా మధ్యలో ఎంట్రీ ఇచ్చి స్టెప్పులేశాడు. నజ్రియా, నాని, అంజన కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. అంజన క్యూట్ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

శ్యామ్ సింగ‌రాయ్’ మూవీతో హిట్ అందుకున్న నానికి ‘అంటే.. సుందరానికీ!’ మూవీపై భారీ ఆశలే ఉన్నాయి. బ్రాహ్మణ అబ్బాయిగా కామెడీని పండిస్తునే.. భావోద్వేగాలను చూపిస్తూ నాని ఛాలెంజింగ్ రోల్ చేశాడని దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పాడు.