అజిత్ కోసం వేచి చూస్తున్న బిల్లా ఆర్టిస్ట్

కరోనా వైరస్ కారణంగా పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఇళ్లకే పరిమితమైపోయారు. లాక్‌డౌన్ తో దిన‌స‌రి వేతనం పొందే సినీ కార్మికుల‌కి ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారికి పూట గ‌డ‌వ‌డ‌మే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మ‌న సినీ సెల‌బ్రిటీలు మాన‌వ‌త్వంతో ముందుకు వ‌చ్చి వారికి తోచినంత సాయం చేస్తున్నారు. అయితే అజిత్ బిల్లా 2 చిత్రంలో న‌టించిన‌ గ‌ణేష‌న్ అనే ఆర్టిస్ట్ ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేకుండా ఇబ్బంది ప‌డుతున్నాడు. త‌న స‌మ‌స్య‌ల‌ని ఓ వీడియోలో రూపొందించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు గ‌ణేష‌న్.

కాగా గ‌ణేష‌న్ వీడియో లారెన్స్ దృష్టికి చేరింది. అందుకు లారెన్స్ ఆయ‌నకు తప్ప‌క సాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ వీడియోని అజిత్‌కి పంపిస్తాను. ఆయ‌న చూసిన‌ట్టయితే నిన్ను త‌ప్ప‌క ఆదుకుంటారు. నీ ఫ్యామిలీకి అండ‌గా నిలుస్తారు అని లారెన్స్ పేర్కొన్నారు. అజిత్‌, లారెన్స్ ఇప్ప‌టికే సినీ కార్మికుల‌ని ఆదుకొనేందుకు గాను ఫెప్సీకి భారీ విరాళాలు అందించిన విష‌యం తెలిసిందే.