కరోనా గురించి తెలియక.. నెలరోజులుగా సముద్రంలోనే… ఆ జంట

విశ్వంలో ఇప్పుడు కరోనా వైరస్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రపంచమంతా ఈ పేరునే జపం చేస్తుంది. మరెప్పుడు మర్చిపోలేనంతగా ఈ కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రపంచమంతా కరోనాతో కాగిపోతుంటే ఓ జంట‌కి మాత్రం క‌రోనా గురించే తెలియదంట.

అసలు విషయం ఏమిటంటే… యూకేలోని మాంచెస్ట‌ర్‌కి చెందిర ఎలెనా మ‌ణిశెట్టి, ర్యాన్ ఒస్బోర్న్ 2017లో త‌మ ఉద్యోగాల‌కి రిజైన్ చేసి బోట్‌ని కొనుగోలు చేశారు. ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌యాణిస్తూ.. ఇంట్లో వాళ్ల‌తో అప్పుడ‌ప్పుడు ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే బ్యాడ్ న్యూస్ ఏవి త‌మ‌కి చెప్ప‌కూడ‌ద‌నే నిబంధన కూడా పెట్టార‌ట‌. దీంతో కోరనా మ‌హ‌మ్మారి గురించి వారికేం చెప్పలేదట. అయితే ఈ జంట గత నెలలో కానరీ దీవుల నుంచి కరేబియన్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు.. క‌రోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో అనేక దేశాలు త‌మ‌ స‌రిహ‌ద్దుల‌ని మూసివేశాయి. ఇలాంటి సమయంలో వేలాది ప్ర‌యాణికుల‌తో కూడిన‌ క్రూయిజ్ షిప్ స‌ముద్రంలోనే చిక్కుకుపోయింది.

అయితే క‌రేబీయ‌న్ దీవుల‌కి చేరుకున్న ఈ జంట దాని స‌రిహ‌ద్దు మూసి ఉంద‌ని తెలిసి షాక్ అయ్యారంట. కరేబియన్ ద్వీపం సరిహ‌ద్దులు మూసి ఉన్నాయ‌ని తెలుసుకున్న ఆ జంట తమ నౌకను గ్రెనడాకు మళ్లించారు. అక్కడ వారు చివరకు ఇంటర్నెట్ కనెక్షన్ పొందగలిగారు. ఆతర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకున్నారు. వెంట‌నే సెయింట్ విన్సెంట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసిన ఈ జంట ఆతిధ్యం కోసం ప్ర‌య‌త్నించారు. ఇటలీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా త‌ల‌దాచుకునే అవ‌కాశం లేద‌ని వారి స్నేహితులు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా ప్ర‌స్తుతం సెయింట్ విన్సెంట్ ప్రాంతంలో ఉన్న వీరు 25 రోజుల పాటు స‌ముద్రంలోనే ఐసోలేష‌న్‌లో ఉండ‌వలసిన పరిస్థితి ఏర్పడింది. కాగా జూన్ లో హరికేన్ సీజన్ ప్రారంభం కానుంది. అంత క‌టే ముందే త‌మ‌ని అధికారులు అనుమ‌తిస్తార‌ని ఆశిస్తున్నామని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.