విజయ దేవరకొండ కి సవాలు విసిరిన ప్రముఖ డైరెక్టర్

విజయ దేవరకొండ కి సవాలు విసిరిన ప్రముఖ డైరెక్టర్

తెలుగు సినీ ప్రముఖులు ది రియల్ మాన్ పేరుతో ఇంట్లో తమ పనులను తాము చేసుకుంటూనే, ఇంట్లొ స్త్రీలకు సహాయం చేస్తున్నారు. అయితే రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కు కూడా ఛాలెంజ్ చేశారు. అయితే కొరటాల శివ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి పూర్తి చేశారు. మొదట్లో కష్టంగా ఉన్నా, రాను రానూ అలవాటు అయ్యి, ఇపుడు సరదాగా మారింది అని కొరటాల శివ వ్యాఖ్యానించారు. అంతేకాక దేవరకొండ కు ఇదే ఛాలెంజ్ విసిరారు.

అయితే కొరటాల శివ ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే చిరంజీవి తో తీస్తున్న ఆచార్య సినిమా కు సంబంధించిన వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అంతేకాక లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఆచార్య శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవడమే కాక, లాక్ డౌన్ ముగియగానే ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవాశాలున్నాయని తెలుస్తుంది. విజయ దేవరకొండ సైతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా జోడు అందరూ తమ ఇళ్ళల్లో ఉంటు వారి పనులను చేస్తున్నారు.