విజయ్ దేవరకొండ పరువు తీసేస్తున్న నెటిజెన్స్

విజయ్ దేవరకొండ పరువు తీసేస్తున్న నెటిజెన్స్

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఏకంగా నలుగురు హీరోయిన్ హీరోయిన్స్ తో కలిసి నటించిన చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. కె క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే భారీ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఈరోజు సన్ నెక్స్ట్ మరియు నెట్ ఫ్లిక్స్ లలోకి అందుబాటులోకి వచ్చింది.

అయితే ఈ సినిమా తమ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిందని నెట్ ఫ్లిక్స్ వారు ట్వీట్ చెయ్యగా దానికి ఈ సినిమా చూసిన వారు ఇచ్చిన రిప్లై లు చూడాలి. అసలు ఈ సినిమా ఎందుకు తీసుకున్నారని ఏకంగా ఈ సినిమానే తీసేసి ఇంకో సినిమా తీసుకోమని అంటున్నారు.

అలాగే ఇంకొంత మంది అయితే ఈ సినిమా పెద్ద టార్చర్ అని ఎవరూ చూడొద్దు అంటూ ఏకేస్తున్నారు.మరికొంత మంది అయితే తమ జీవితంలోనే ఇలాంటి సినిమా చూడలేదని అంటున్నారు. ఈ సినిమాపై నెగిటివిటి ఉందన్నారు కానీ మరీ ఈ స్థాయిలో ఉండి ఉంటుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.