సైలెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ

సైలెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న క్రమంలో కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి దాదాపు సినీ ప్రముఖలందరూ ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు తమ స్థాయికి తగ్గట్లు ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితులకు అండగా నిలిచారు.

అయితే కరోనా విరాళాలల్లో విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి విరాళం లేకపోవడంతో ఇప్పటికే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి, కరోనా విరాళాలల్లో జీరోగా మిగిలిన విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కరోనా బాధితుల సహాయార్థం కొరకు విజయ్ విరాళం ప్రకటిస్తాడేమో చూడాలి.

చిన్న రోల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి సినిమాలతో తక్కువ టైంలోనే విజయ్ దేవరకొండను సెన్సేషనల్ స్టార్ ని చేసారు ప్రేక్షకులు. తనని ఇంతవాడిని చేసిన ప్రజలు కష్టకాలంలో ఉంటే, మరి విజయ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో. ఈ కరోనా సంక్షోభ సమయంలో కరోనా బాధితులకు ఇకనైనా విజయ్ అండగా నిలవాలని అతని రౌడీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.