త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే అభిమానించే వారు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. తనదైన మాటలతో అల్లరి చేసే యువతతో చప్పట్లు కొట్టించడం త్రివిక్రమ్ స్పెషలాటి. అలాగే తెలుగు మూలాలను సాహిత్యాన్ని తన సినిమాల్లో చాలా చక్కగా త్రివిక్రమ్ సినిమాల ద్వారా ఆడియెన్స్ కు అందిస్తారు.అందుకే తన అభిమానులు ఆయన్ని గురూజీ అని పిలిచుకుంటారు. దీనితో ఆ అభిమానులు అంతా ఈరోజు త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్ళు కావడంతో సోషల్ మీడియాలో తమ అభినందనలు తెలుపుతున్నారు. కానీ త్రివిక్రమ్ లో మరో యాంగిల్ కూడా ఉంది.

తాను ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ అయినా సరే ఏదొక హాలీవుడ్ సినిమా నుంచో కాపీ కొట్టింది ఉంటుంది. ఎందుకో ఇప్పుడు ఇదే మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.జస్ట్ నిన్నటి నుంచి ఎందుకో త్రివిక్రమ్ మీద పగ పట్టేసినట్టుగా త్రివిక్రమ్ వీడియోలు అన్ని పెట్టి ట్రోల్స్ మొదలు పెట్టారు. కొన్ని పేస్ బుక్ పేజెస్ లో అయితే ప్రతీ వీడియో ను వెలికి తీసి పోస్టులు పెడుతున్నారు. ఇంత సడెన్ గా ఎందుకు పగబట్టారో మరి..